Oct 16,2023 22:41

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఇంటర్మీడియట్‌ అర్హతతోనే వీఆర్‌ఏలకు ఉద్యోగ్యోన్నతులు కల్పించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు కోదండ, బాలసుబ్రమణ్యం డిమాండ్‌ చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్‌ 13 అనుసరించి ఇంటర్మీడియట్‌ అర్హతతో 3795 మంది వీఆర్‌ఏలకు ఉద్యోగ్యోన్నతులు కల్పించారన్నారు. అలాగే జీవో నెంబర్‌ 104 ప్రకారం మిగిలిన సీనియార్టీ జాబితాలో ఉన్నవారికి డిగ్రీ అర్హతతో ఉద్యోగ్యోన్నతులు కల్పిస్తామని జీవో జారీ చేయగా వారు హైకోర్టును ఆశ్రయించారని, హైకోర్టు సిసిఎల్‌కు ఇంటర్మీడియట్‌ అర్హతతోనే ఉద్యోగ్యోన్నతులు కల్పించాలని ఉత్తర్వులు జారీచేసినట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వుల మేరకు ఇంటర్మీడియట్‌ అర్హతతోనే పదోన్నతులు కల్పించాలని వీఆర్‌ఏ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.