Dec 30,2022 23:51

మాట్లాడుతున్న రూపవతి

ప్రజాశక్తి - కశింకోట
జిల్లాలోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న గ్రూప్స్‌ లాంగ్వేజెస్‌ అధ్యాపకులు 77 మందికి మండలంలోని తాళ్లపాలెం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో ఓరియంటేషన్‌ శిక్షణ శుక్రవారం నిర్వహించారు. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలపై ఈ శిక్షణ నిర్వహించారు. విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల సమన్వయ అధికారి రూపవతి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరంలో జరిగే ఇంటర్‌ పరీక్షల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించాలని మార్గ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సబ్జెక్టల వారీగా బృందాలుగా ఏర్పడి మినిమం స్టడీ మెటీరియల్‌ తయారు చేశారు. సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చి మిగతా విద్యార్థులతో సమానంగా ఫలితాలు సాధించే పద్ధతులపై అనుభవజ్ఞులైన వారితో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కళాశాలలో అటల్‌ థింకరింగ్‌ ల్యాబ్‌ ఫిజిక్స్‌, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబ్స్‌లను పరిశీలించారు. విద్యార్థులు పనితీరు మెస్‌ డార్మెంటరీ అన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.