Jul 04,2023 20:59

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి ; ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థుల వివ రాలను చైల్డ్‌ ఇన్ఫో డాట్‌కామ్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ గిరీష తెలిపారు. మంగళవారం పట్టణంలో ఓ కల్యాణ మండపంలో ప్రభుత్వ, ప్రయివేట్‌ జూని యర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఇంటర్‌లో విద్యార్థులు చేరిక, చైల్డ్‌ ఇన్ఫోడాట్‌ కామ్‌ ఆన్‌లైన్‌ నమోదుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ చేసి చైల్డ్‌ ఇన్ఫోడాట్‌ కామ్‌లో నమోదు చేయా లన్నారు. 60 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఇంటర్‌ మొదటి సంవత్స రంలోకి జాయిన్‌ అవుతున్నారన్నారు. మిగిలిన 40 శాతం మంది ఎక్కడికి పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా 10 పాసైన ప్రతి విద్యార్థి ఇంటర్‌లో ప్రవేశం పొందేల చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 2.70 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2.58 లక్షల మంది విద్యార్థుల నమోదు చేశారని, జిల్లా మొత్తం 95 శాతం నమోదు చేశారని పేర్కొన్నారు. మిగిలిన ఐదు శాతం కూడా నమోదు చేసేం దుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణతులై ఇంటర్‌ మొదటి సంవత్సరానికి చాలా మంది విద్యార్థులు జాయిన్‌ కావడం లేదన్నారు. కళాశాల ప్రిన్సిపల్స్‌, విద్యాశాఖ అధికారులు అడ్మిషన్ల ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిం చాలన్నారు. జాయిన్‌ అయిన విద్యార్థుల వివరాలను చైల్డ్‌ ఇన్ఫోడాట్‌ కామ్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాలో 130 కాలేజీలకు 50 కాలేజీలు మాత్రమే విద్యార్థులు మొదటి సంవత్సరం చేరినట్లు ఎన్‌రోల్‌మెంట్‌ చేశారని తెలిపారు. మిగిలిన కళాశాలలో కూడా త్వరగా ఎన్‌రోల్‌మెంట్‌ చేయాలన్నారు. ఎవరిని మిస్‌ చేయకుండా డేటా ఎంట్రీ చేయాలన్నారు. జాయిన్‌ అయిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో వీలైనంత త్వరగా నమోదు చేయాలన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశం పూర్తయిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న విద్యార్థుల మీద దష్టి పెట్టి వారి తల్లిదండ్రులతో మాట్లాడి కళాశాలలో విద్యార్థులు ప్రవేశం పొందేల ప్రతి ఒక్కరూ కషి చేయాలని ప్రిన్సిపాళ్లను సూచించారు. డేటా ఎంట్రీ చేయని కాలేజీల వారీగా కలెక్టర్‌ సంబంధిత ప్రిన్సిపాల్‌ను వివరాలను అడిగి తెలుసుకుని రెండు రోజుల్లో డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డివిఇఒ కృష్ణయ్య నాయక్‌, ఆర్‌ఐఒ రవి, డిఇఒ పురుషోత్తం, ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌లు పాల్గొన్నారు.