Mar 19,2023 23:59

దగ్ధమైన సామగ్రిని పరిశీలిస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి-రావికమతం:మండలంలో గుమ్మాలపాడు గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో ప్రమాదం వాటిల్లింది. గుమ్మాలపాడు గ్రామంలో ఆదివారం గ్రామానికి చెందిన గొర్లె సత్తిబాబు ఇంట్లో హీటర్‌ స్విచ్‌ ఆన్‌ చేసి వది లేయడంతో ఇల్లంతా పొగలు కమ్మాయి. దీంతో మిక్సీ, గ్రైండర్‌ పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో పెనుముప్పు తప్పింది. ఈ సందర్భంగా ఫైర్‌ సిబ్బంది మాట్లాడుతూ, ఇంట్లో వాడుతున్న వంటగ్యాస్‌, కుక్కరు, హీటరు, గ్రైండర్‌, ఎలక్ట్రికల్‌ పరికరాలు ఉపయోగంపై తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.