ఫొటో : మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి ఇఒపిఆర్‌డి ఖాదర్‌పాషా
ఇంటిపన్ను వసూలుపై దృష్టి సారించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : పంచాయతీ నిధుల సమీకరణకు ఇంటిపన్ను వసూలుపై సచివాలయం సిబ్బంది దృష్టి పెట్టాలని ఇన్‌ఛార్జి ఇఒపిఆర్‌డి ఖాదర్‌పాషా పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బసినేనిపల్లి సచివాలయంలో సందర్శించిన ఆయన రికార్డులను, బయోమెట్రిక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్‌డబ్ల్యూపిసి కేంద్రాన్ని సక్రమంగా వినియోగిస్తూ, ఇంటి పన్నులను వసూలు చేసి పంచాయతీ ఆదాయానికి సహకరించాలన్నారు. సిబ్బంది వాలంటీర్లు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి.రవీంద్ర, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










