శంకుస్థాపన చేస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి-పొందూరు : నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్య మని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం దల్లిపేట పంచాయతీ రెడ్డిపేటలో సర్పంచ్ కంబాపు నీలవేణి ఆధ్వర్యంలో శనివారం జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రూ.40 లక్షలతో ఇంటింటికీ కొళాయిల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగేళ్లలో అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, ఎఎంసి చైర్మన్ బాడాన సునీల్‌కుమార్, కిల్లి నాగేశ్వరరావు, కంబాపు సూర్యారావు, వైసిపి మండల అధ్యక్షులు పప్పల రమేష్‌కుమార్, ఎంపిడిఒ సీపాన హరిహరరావు, తహశీల్దార్ వై.వి.ప్రసాద్, పిఎసిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి పాల్గొన్నారు.










