- శాసనసభ స్పీకర్ సీతారాం
ప్రజాశక్తి- పొందూరు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ రక్షిత తాగునీటిని అందజేయడమే తన లక్ష్యమని శాసనసబ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కోటిపల్లి పంచాయతీ మజ్జిలిపేటలో జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రూ.64 లక్షలతో ఇంటింటికీ తాగునీటి కుళాయిల ఏర్పాటుకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సీపాన హరిహరరావు, జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, సర్పంచ్ గురుగుబెల్లి సుధారాణి, మాజీ సర్పంచ్ వాసుదేవరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎఎంసి చైర్మన్ బాడాన సునీల్‌కుమార్, వైసిపి మండల అధ్యక్షుడు పప్పల రమేష్‌కుమార్, వైస్ ఎంపిపి ప్రతినిధి వండాన వెంకటరావు పాల్గొన్నారు.










