ప్రజాశక్తి-ఆదోనిరూరల్
రాష్ట్రంలో వైసిపి హయాంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తోందిన ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం నాలుగో రోజు మండలంలోని సంతేకుడ్లూరు, బలాదూరు, ఎడవల్లి గ్రామాల్లో 'గడపగడప మన ప్రభుత్వం' నిర్వహించారు. సంతేకుడ్లూరు ఎస్సీ కాలనీలోని ఎస్సీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. కొంతసేపు ఎమ్మెల్యే ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అనంతరం అక్కడ జరుగుతున్న నాడు-నేడు పనుల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బలాదూరు గ్రామంలో నూతనంగా చేపట్టిన తాగునీటి పైపులైన్ ద్వారా నూతన కుళాయిలకు పూజలు చేశారు. ఎంపిడిఒ గీతావాణి, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, ఆయా కార్పొరేషన్ల డైరెక్టర్లు మంజుల, రేణుక, మున్సిపల్ ఛైర్మన్ బోయ శాంత, సర్పంచి ధనలక్ష్మి, ఎంపిటిసి కనకమ్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ నాగ మల్లయ్య, ఇఒఆర్‌డి జనార్ధన్, హౌసింగ్ బోర్డు అధికారి తిక్కన్న, వైసిపి మహిళా నాయకులు శ్రీలక్ష్మి కల్పవల్లి, వైసిపి సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి, బడాయి పంపాపతి, గోవర్ధన్ రెడ్డి, విఆర్‌ఒ చిన్న ఈరన్న, ఇస్వి ఎస్‌ఐ విజయలక్ష్మి పాల్గొన్నారు.
విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి










