ఇంటింటికి సంక్షేమ పాలన
ప్రజాశక్తి-కావలి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సుపరిపాలనతో ఇంటింటికి అందించిన సంక్షేమ పాలనకు గడపగడపలోనూ తమకు ఆప్యాయత లభిస్తుందని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని 29వ వార్డులో బుధవారం ''గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం'' 169వరోజు నిర్వహించారు. వార్డుకు విచ్చేసిన ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి 29వ వార్డ్ ఇన్‌ఛార్జి పెనుమల్లి అశోక్ ఆధ్వర్యంలో వైసిపి నాయకుడు లెక్కల మురళి మోహన్ రెడ్డి, వింతా ప్రభాకర రెడ్డి, కూరపాటి కృష్ణారెడ్డిలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్ద ప్రజలు ఎంఎల్‌ఎ రామిరెడ్డికి ప్రతి గడపలోనూ ఆప్యాయత చూపుతూ మహిళామణులు పూల వర్షం కురిపించారు. హారతులు అందజేసి, వీర తిలకం దిద్ది, స్వాగతం పలికారు. 29వ వార్డు ప్రజలు ఎంఎల్‌ఎకు ప్రతి గడపలోనూ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటింటికి వెళ్లి, ప్రజాసమస్యలను తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వంలో లబ్ధి పొందిన కుటుంబాలకు సంక్షేమ పథకాల బుక్‌లెట్‌లను అందజేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, అమరా వేదగిరి సుబ్బారాయుడు గుప్తా, తిరివీధి ప్రసాద్, గంధం ప్రసన్నాంజనేయులు, కనుపర్తి రాజశేఖర్, కుందుర్తి శ్రీనివాసులు, శ్రీనివాసులు రెడ్డి, కామయ్య, పులి రజిని, నాయుడు రామ్‌ప్రసాద్, పరుసు మాల్యాద్రి, మున్సిపల్ కమిషనర్ కిరణ్, మెప్మా సిబ్బంది, సచివాలయసిబ్బంది, గుర్రం వెంకటేశ్వర్లు (జి.వి.), సలీమ్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.










