శిక్షణ ఇస్తున్న అధికారులు
ప్రజాశక్తి - హోళగుంద
ఈనెల 21 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించే ఇంటింటి సర్వేకు సంబంధించి బిఎల్‌ఒలకు శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అండ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున మాట్లాడారు. వారు స్పెషల్ సమ్మరి రివిజన్-2024కు సంబంధించి పాటించే నియమ, నిబంధనలను వివరించారు. తహశీల్దార్ హుస్సేన్ సాహెబ్, మండల సర్వేయర్ శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దినోజ్ పాల్గొన్నారు.










