కడప సిటీ : ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ, ఓటరు నమోదు జాబితా 2024 కు సంబంధించి జిల్లాలో చేపడుతున్న ఇంటింటి సర్వేని బాధ్యతగా నిర్వహించాలని నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని కలెక్టర్ వి.విజరు రామరాజు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలు నుంచి 'ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024'కి సంబంధించి ఇంటింటి పరిశీలనలో భాగంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ పై కలెక్టర్, జేసీ గణేష్ కుమార్, నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, శిక్షణా కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి ఎఇఆర్‌ఒలు, బిఎల్‌ఒలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేర్ల తొలగించారని ఎవ్వరు కూడా ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం లేకుండా చేయాలన్నారు. ఇంటింటి సర్వే పై నియోజకవర్గ మండలాల ప్రత్యేక అధికారులు ఈ నెల 21లోగా ఇంటింటా సర్వే వంద శాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇంటింటా సర్వేకి బిఎల్‌ఒలతోపాటు పాటుగా బిఎల్‌ఎలు మాత్రమే వెళ్లాలన్నారు. నియోజకవర్గ, మండలాల ప్రత్యేక అధికారులు రోజూ నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల పరిధిలోని బిఎల్‌ఒలతో కలిసి పరిశీలించాలన్నారు. మండలానికి సంబంధించి తహశీల్దార్, డిటి, ఎలక్షన్ డిటి, బిఎల్‌ఒలు, బిఎల్‌ఎ లు వారి జాబితా, ఫోన్ నెంబర్లను ప్రత్యేక అధికారుల వద్ద ఉంచుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్ని గహాలు పరిశీలించారు. ఎంత మందిని కొత్త ఓటర్లను చేర్చారు, ఎంతమంది ఓటర్లను డిలీట్ చేశారు. ఎంత మంది ఓటర్లు బదిలీ చేసుకున్నారు అనే విషయాలు రోజూ యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఓటరు జాబితా విడుదల చేస్తారని, 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్ జాబితాలో ఎక్కించడం, చనిపోయిన, వివాహమైన వారిని తొలగిస్తారని చెప్పారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని పూర్తి అంగవైకల్యం కలిగిన వారిని పిడబ్ల్యుడి ఓటర్లుగా గుర్తిస్తారని తెలిపారు. ఫారం-6 ద్వారా 18 సంవత్సరాలు నిండిన వారికి కొత్త ఓటరుగా దరఖాస్తు చేయాలని, ఫారం-7 ద్వారా చనిపోయిన లేదా వివాహమైన వారిని తొలగిస్తారన్నారు. ఫారం-8 చిరునామా మార్పులు, మైగ్రేషన్, షిఫ్టింగ్ కోసం ఇవ్వాలన్నారు. 6,7,8 ఫారాలకు సంబంధించి సపోర్టు పత్రాలను తీసుకొని, బిఎల్‌ఎల నుంచి సంతకం తీసుకోవాలన్నారు. సమావేశంలో బోర్డు మీటింగ్ హాలు నుంచి డిఆర్‌ఒ గంగాధర్‌గౌడ్, కడప, జమ్మలమడుగు, పులివెందుల ఆర్‌డిఒలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ, డ్వామా, హౌసింగ్, ఐసీడీఎస్ పిడీలు ఆనంద్ నాయక్, యదుభూషన్ రెడ్డి, కష్ణయ్య, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.










