ప్రజాశక్తి- కందుకూరు :టిడిపి కందుకూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం అజ్మల్ హుస్సేన్ హాస్పిటల్, పోతురాజుమిట్ట ప్రాంతాల్లో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ఇతర నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు వివరించడంతోపాటు, టిడిపి మినీ మేనిఫెస్టో పథకాలను తెలియజేస్తూ ష్యూరిటీ బాండ్లను వివరించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షుడు షేక్ ఖలీల్, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ సలాం, బాషా, హషిం, రసూల్, గౌస్ బాషా, రియాజ్, అమిరుల్లా బాబు, షఫీ, నయూమ్, మాభాష వలీబాషా, భాషిద్, రహంతుల్లా, జూబేర్, ఖాదర్ బాషా, పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య, చిలకపాటి మధుబాబు, వడ్డెళ్ళ రవిచంద్ర, షేక్ మున్నా ఉన్నారు.