ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరు పట్టణంలోని 15వ వార్డులో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి నాగేశ్వరరావు ఇంటింటికి తిరుగుతూ ఎలా ఉన్నారు ? మీ ఇబ్బందులేమిటి ? ప్రభుత్వ పథకాలు సరిగా అందుతున్నాయా, లేదా అడిగి తెలుసుకున్నారు. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, వద్ధులు, మహిళలు జగన్మోహన్ రెడ్డి పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే నమ్మి ఓటేశామని, ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్మేదే లేదని ఈసారి తెలుగుదేశం పార్టీకి తప్పక ఓటేస్తామని మహిళలు తెగేసి చెప్పారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ సలాం, బాషా, హసీమ్, రసూల్, గౌస్ బాషా, రియాజ్, అమీరుల్లా బాబు, షఫీ, నయూమ్, మాబాషా, వలీబాషా, బాసిద్, రహంతుల్లా, జుబేర్, ఖాదర్ బాషా, పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య, చిలకపాటి మధుబాబు, వడ్డెళ్ళ రవిచంద్ర, గోచిపాతల మోషే, షేక్ రూబీ, సయ్యద్ గౌస్ బాషా, అహ్మద్ బాషా, సయ్యద్ బాబు ఉన్నారు.