Nov 15,2023 22:13

ప్రచారం నిర్వహిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణంలోని 13వ వార్డు బండపాలెం, ఆనందపురం రోడ్డు ప్రాంతంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ పార్టీ మినీ మేనిఫెస్టోను నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు వివరించారు. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ. 1500 జమ చేస్తారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కందుకూరులో తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షులు యల్లంటి మాల్యాద్రి, స్థానిక నాయకులు, కనకరాజు, కోదండరామయ్య, మాల్యాద్రి, రమణయ్య, అంజయ్య, హరి, సైమన్‌, భూసి రాజ,జక్కుల రవి,ప్రసాద్‌,వెంకటరావు, దార్ల శ్రీను, గెంటినపల్లి బలరాం, గౌస్‌ బాషా, లక్ష్మయ్య, చరణ్‌, సాయి, వరప్రసాద్‌, లోకేష్‌, విశాక్‌, పెద్దకత్తుల రవి, కిషోర్‌, బాబి,అభి, గోపి, భాబ్జి, మాధవ, గుమ్మడి మాల్యాద్రి, చెంచు కష్ణ, మాచర్ల, కొటపురి శ్రీను చేమిడిగుంట రాజశేఖర్‌ ఉన్నారు.