Oct 20,2023 23:11

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌, యు.కొత్తపల్లి చంద్రబాబు అరెస్ట్‌ రిమాండ్‌పై కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తూ శుక్రవారం సామర్లకోటలోని 25, 26 వార్డుల్లో బాబుతో నేను ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలు వేశారు. టిడిపి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్‌ బలుసు వాసు, నాయకులు బి.త్రిమూర్తులు, ఎండి షఫీ ఉల్లా, ఎండి సైఫుల్ల, పడాల వీరబాబు, గోలి ధర్మరాజు పాల్గొన్నారు. యు.కొత్తపల్లి రానున్న ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి అభివద్ధి పథంలో నడిపించే నాయకుని ఎన్నుకోవాలని పిఠాపురం మాజీ ఎంఎల్‌ఎ, టిడిపి అధికార ప్రతినిధి ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ అన్నారు. యు.కొత్తపల్లి మండలం ఎండపల్లిలో శుక్రవారం బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి మహిళలకు టిడిపి హయాంలో చేసిన అభివృద్ధిని వివరించి టిడిపి అధికారం చేపడితే అమలయ్యే సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. రూ.13 కోట్లతో టిడిపి హయాంలో ఎండపల్లి గ్రామాన్ని అభివద్ధి చేశామని తెలిపారు. గ్రామంలో కళ్యాణ మండపం నిర్మిస్తే వాటిని సచివా లయాలుగా నిర్వహి స్తున్నందుకు వైసిపి ఎంఎల్‌ఎ సిగ్గుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ ఎస్‌.అప్పలరాజు, అధ్యక్షులు అనిశెట్టి సత్యానంద రెడ్డి పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ మండలంలోని గుర్రప్పాలెం, భావవరంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మహిళా శక్తి చైతన్య రథయాత్ర నిర్వహించారు. పాలూరి బోసు బాబు, దాపర్తి సీతారామయ్య, బుర్రి సత్తిబాబు, పోలినాటి ధర్మానందకుమారి, గుమ్మల అనంతలక్ష్మి, గొల్లవల్లి శ్రీదేవి, రాపాక లక్ష్మి, గెద్దాడ సత్యవేణి, ఎల్లాటి అమ్మాజీ, చెక్క మరియా, తిప్పన సత్యవతి, గొల్లవిల్లి వరలక్ష్మి, కడారి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.