Oct 07,2023 01:01

ప్రజాశక్తి - చీరాల 
పేదలకు ఇంటి వద్దనే నాణ్యమైన వైద్యం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ అన్నారు. మండలంలోని తోటవారిపాలెం సచివాలయం1లో శుక్రవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిభిరాన్ని ఆయన పరిశీలించారు. వైద్యశిభిరంలో 371 మందికి వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, తహశీల్దారు జివి ప్రభాకరరావు, ఎంపిడిఒ కె నేతాజీ, మెడికల్ ఆపీసర్ సిహెచ్ శ్రీదేవి, డిప్యూటీ తహశీల్దారు సురేష్, ఆర్బికె చైర్మన్ కావూరి రమణారెడ్డి, పిఎసిఎస్ ఛైర్మన్‌ బోయిన కేశవులు, జెసిఎస్ ఇంచార్జీ బుర్ల సాంబశివరావు, మాజీ వైస్ ఎంపిపి నాదెండ్ల కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి షేక్ ఇమ్రాన్ పాల్గొన్నారు.