Jul 20,2022 00:30

మాట్లాడుతున్న ఆరో వార్డు వైసిపి నాయకులు

ప్రజాశక్తి -పిఎం పాలెం : జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయని జివిఎంసి 6వ వార్డు వైసిపి అధ్యక్షుడు బొట్టా అప్పలరాజు పేర్కొన్నారు. వార్డులోని వైసిపి కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వార్డులో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. అయినా మీడియాలో కనపడాలనే ఉద్దేశంతో జనసేన, టిడిపిలు పలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధి చేశామో.. లేదో ప్రజలు చెప్తారన్నారు. వైసిపి నాయకులు పోతిన యల్లాజి మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విన్యాసాలు చేసినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపికే ప్రజలు పట్టం కడతారన్నారు. సియాద్రి కనకరాజు మాట్లాడుతూ, పందులు పడుకునే ప్రదేశాలకు వెళ్లి జనసేన నాయకులు గుడ్‌ మార్నింగ్‌ సిఎం సార్‌ కార్యక్రమాలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. 6వ వార్డులో రూ.23.56 కోట్లుతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. పిల్లా రమణ మాట్లాడుతూ, ఫొటోలో దిగడానికే జనసేన నాయకులు ఎక్కడ గోతులున్నాయో వెతుకుతున్నారని ఆరోపించారు. పోతిన ప్రసాద్‌ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు జగన్మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పోతిన మూర్తిబాబు, వరలక్ష్మి, గుంటుబోయిన సంజీవ్‌, రాయిన సాయి, లోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.