
ప్రజాశక్తి - చీరాల
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు ఇంటి వద్దకే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నట్లు కౌన్సిలర్ సూరగాని లక్ష్మి అన్నారు. అన్ని రకాల వైద్య సేవలను సిఎం వైఎస్ జగన్ అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. పేరాల ముత్యాలపేటలోని మహాలక్ష్మి చెట్టు వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిభిరాన్ని ఆమె గురువారం ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది అన్నారు. వైద్య పరీక్షలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్స్ కు రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. కావున ప్రజలందరూ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, కౌన్సిలర్లు స్వాతి హాజరయ్యారు.