సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న డిఎల్‌పిఒ
ప్రజాశక్తి -మాకవరపాలెం: గ్రామ పంచాయతీ ల్లో ఇంటి పన్నుల వసూళ్ల పై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి శిరీష రాణి సూచించారు. గురువారం మండలంలోని పైడిపాల, తాడపాల పంచాయతీలో ఇంటి పనులు వసూళ్లు, చెత్త సంపద కేంద్రాల నిర్వహణ, పారిశుధ్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ, ఈ నెల చివరి నాటికి 100 శాతం ఇంటి పన్నుల వసూళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీల్లో మురుగునీటి కాలువలు పరిశుభ్రం గా ఉండేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్‌డి సీతామలక్ష్మి, కార్యదర్సులు హైమావతి, అప్పలాచారి పాల్గొన్నారు.










