రాజంపేట : ఉమ్మడిజిల్లాలో జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణాల్లో నియోజవర్గం మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. శనివారం రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీని వాసులురెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమా వేశానికి ఎమ్మెల్యే మేడా వెంకటమల్లికార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా సమస్య లను పరిష్కరించాలన్నా తపనతో ముఖ్యమంత్రి జగన్‌మో హన్‌రెడిడ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. కౌన్సిలర్ వరకు అందరినీ వివిధ సంక్షేమాల పథకాల పేరుతో గడప గడపకూ పరుగులు తీయించి ప్రజల సమస్యలను తెలుసుకుని అప్పటి కప్పుడే వాటిని పరిష్క రించే విధంగా సిఎం అహర్నిశలు కషి చేస్తు న్నారని అన్నారు. కులం, మతం పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అంది స్తున్నామని చెప్పారు. కూచివారిపల్లెకు చెందిన గుత్తా వెంకట్రా మనాయుడు పేరుతో వత్తలూరుకు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి సర్వేనెంబర్ 544 లో త్రిభు జాకారంలో ఉన్నటువంటి 22 సెంట్ల స్థలంలో అర్బన్ డెవలప్మెంట్ కింద మున్సిపాలిటీ వారు ఒక పార్కును నిర్మించి ఆపార్కుకు గుత్తా వెంకట్రామనాయుడు పేరును నామకరణం చేస్తున్నామని చెప్పారు. ఇది చాలా ఆనదించదగ్గ విషయమన్నారు. వెంకట రామ నాయుడు గతంలో సర్పంచ్ గా పనిచేసి ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు అందించారని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలకు, కళాశాలకు స్థలాన్ని ఉచితంగా ఇచ్చారని ఆయన సేవలను ఎన్నటికీ మరువలేమని చెప్పారు. ఆయనను గుర్తుపెట్టుకుని టిడిపి చేయలేని పనిని ఆయన పేరు మీద పార్కును ఏర్పాటు అభివృద్ధి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.










