ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్తగా ప్రవేశ పెట్టిన కార్డు ప్రైమ్ 2.0 సందర్భముగా ప్రజలు, దస్తావేజు లేఖర్లు, డిటిపి ఆపరేటర్లు మరియు స్టాంపు వెండర్లుకు జరుగు నష్టంపై రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ నెల 30, 31 తేదీలలో ఇంకొల్లు సబ్జిస్ట్రారు ఆఫీసు పరిధిలో కార్డు ప్రైమ్ 2.0కు నిరసనగా పెన్ డౌన్ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి ఇంకొల్లు సబ్ రిజిస్ట్రారు ఆఫీసు పరిధిలోని దస్తావేజు లేఖరులు తానికొండ ఎలియాజరు (దస్తావేజు లేఖర్లు రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు), అమ్మనమంచి శ్రీనివాసరావు, బండ్ల వెంకట సుబ్బారావు, షేక్ అబ్దులా, పోలూరి జగన్మోహనరావు, వంకాయలపాటి శ్రీనివాసరావు, బాచిన శ్రీనివాసరావు, చల్లా పూర్ణచంద్రశేఖర్, యనమండ్ర కృష్ణమోహన్, రావి మధుసూదనరావు, డిటిపి ఆపరేటర్లు కుర్రా అనంతలక్ష్మి మద్దినేని నిర్మల, మండవ రాఘవ, జరుగుల పార్వతి, స్టాంపు వెండర్లు బాచిన శ్రీనివాసరావు, అమరా రామమోహనరావు, రావూరి రంగారావు పెన్డెడౌన్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.










