పథకాల బుక్‌లెటన్‌ను ఇస్తున్న ఎమ్మెల్యే ఫాల్గుణ
ప్రజాశక్తి- పెదబయలు: మండలంలో మారుముల మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఇంజారి గ్రామ పంచాయతీ కేంద్రంలో మంగళవారం అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మావోయిస్తు ప్రభావితం ప్రాంతం అయినప్పటికీ ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులుతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు.పథకాలుం అందకుంటే సంబంధిత అధికారులకు అర్జీ పెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఇంజారి సర్పంచ్ కొండబాబు, జడ్పీటీసీ కె బొంజుబాబు, మాజీ ఎంపీపీ సల్లంగి ఉమామహేష్, వైసిపి సీనియర్ నాయకులు సూరయ్య పాల్గొన్నారు.










