
ప్రజాశక్తి - మొగల్తూరు
మొగల్తూరుకు చెందిన అనంతపల్లి జయశ్రీ ఇంజినీరింగ్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించింది. జయశ్రీ భీమవరంలోని విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది. కళాశాలలో మొదటి స్థానంలో నిలిచింది. ఆదివారం కళాశాల ఆవరణలో స్నాతకోత్సవాలను పురస్కరించుకుని కళాశాల ఛైర్మన్ విష్ణురాజు చేతులమీదగా జయశ్రీకి బంగారు పతకం, ప్రశంసపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆర్యవైశ్య సంఘ సభ్యులు, పలువురు గ్రామ పెద్దలు జయశ్రీని అభినందించారు.