ప్రజాశక్తి-బాపట్ల: మహిళా ఇంజనీరింగ్ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాల జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచిత కంటి, దంత, కాస్మోటాలజీ, హిమోగ్లోబిన్ శాతం, బ్లడ్ గ్రూప్, రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో బాపట్లకు చెందిన సిరి దంత వైద్యశాల, ఏపీ ఆప్టికల్స్, రీజియన్ ఫిజియోతెరఫి, యూపిహెచ్‌సి, విబి కాలనీ వైద్యులు, 5వందల మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రవిశేఖర్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ రవిశంకర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జి శ్రీనివాసరావు, జాతీయ సేవా విభాగం అధికారులు కృష్ణకుమారి, కళ్యాణి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.










