
ప్రజాశక్తి - ఉండి
విద్యలో రాణిస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు లయిన్స్ క్లబ్ చేయూత ఇస్తుందని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు వేగేశ్న అనంతలక్ష్మి అన్నారు. కలిదిండి రామచంద్రరాజు పార్క్ వద్ద ఉండి గ్రామానికి చెందిన కొల్లి వరలక్ష్మికి శనివారం రూ.15 వేల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ దాతలు లయన్ కలిదిండి సీతారామరాజు, లయన్ సత్తిబ్రహ్మారెడ్డి, లయన్ బుద్ధరాజు సుబ్బరాజు ముందుకు వచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. క్లబ్ వైస్ ప్రెసిడెంట్, గాదిరాజు రంగరాజు, సత్తి బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు వివిధ సేవలందిస్తున్నట్లు తెలిపారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్, మాజీ అధ్యక్షులు రుద్రరాజు నరసరాజు, బుద్ధరాజు సుబ్బరాజు మాట్లాడుతూ గతంలో ఎన్‌ఆర్‌పి అగ్రహారానికి చెందిన విద్యార్థికి ప్రతి ఏటా రూ.20 వేల చొప్పున నాలుగేళ్ల పాటు రూ.80 వేలు, కలిగొట్లకు చెందిన విద్యార్థికి ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కలిదిండి సీతారామరాజు భూపతిరాజు, హరినాధ్‌రాజు, బొండాడ సూర్య బ్రహ్మనందం పాల్గొన్నారు.