Aug 23,2023 21:48

సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి

ప్రజాశక్తి - సీతంపేట :  ఇంజినీరింగ్‌ శాఖల్లో జరుగుతున్న అన్ని రకాల పనులను వేగవంతం చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. బుధవారం పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, గిరిజన సంక్షేమ, ఎపిఇపిడిసిఎల్‌, హౌసింగ్‌ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరైన పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. హౌసింగ్‌ లే అవుట్లలో నీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జలజీవన్‌ మిషన్‌ పనులను పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు. ఐటిడిఎ పరిధిలో జరుగుతున్న టూరిజం పనులను పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో పిఆర్‌ ఇఇ రాధారాణి, డిఇ లోకనాధం, ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ ఢిల్లీశ్వరరావు, హౌసింగ్‌ డిఇ మోహనరావు, ఇతర డిఇలు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.