ప్రజాశక్తి - సీతంపేట : ఐటిడిఎ పరిధిలో చేపడుతున్న ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ ఇంజానీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు రాకూడాదన్నారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మానానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపిఒ ఒ.రోసిరెడ్డి పంచాయతీరాజ్ ఇఇ రాధారాణి, డిఇ లోకనాధం, గిరిజన సంక్షేమ శాఖ డిఇ కృష్ణకూమార,్ సిమ్మన్న, డీఈ ఢిల్లీశ్వరరావు, ఇతర ఎఇలు తదితరులు పాల్గొన్నారు.










