Sep 25,2023 20:47

మాట్లాడుతున్న జనరల్‌ వినోద్‌కుమార్‌

ప్రజాశక్తి- డెంకాడ : స్థానిక ఎంవిజిఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం 'ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో ఇంజనీరింగ్‌ కెరీర్‌ అవకాశాలు' అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సెషన్‌కు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వినోద్‌ కుమార్‌ పర్మార్‌, విశాఖ కోస్ట్‌ గార్డ్‌ రిఫిట్‌ అండ్‌ ప్రొడక్షన్‌ సూపరింటెండెంట్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎం.కె పధి, తత్రక్షక్‌ మెడల్‌, విశాఖ తూర్పు సముద్ర తీరం చీఫ్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ (టెక్నికల్‌) హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎం.కె పధి, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ చరిత్ర, దాని విధులు, ఫంక్షన్స్‌, రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ, ప్రయోజనాలపై విద్యార్థులకు వివరించారు. వినోద్‌ కుమార్‌ పర్మార్‌ ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో సాంకేతిక అధికారుల పాత్రలు, బాధ్యతలను చర్చించారు. ఈ సదస్సులో ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.రమేష్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైఎంసి శేఖర్‌ పాల్గొన్నారు.