Dec 14,2022 21:32

ఇందన పొదుపుపై ర్యాలీ

ఇంధన పొదుపు పాటించాలి : ఎస్‌ఇ
తిరుపతి టౌన్‌ :
ఇంధన పొదుపు తప్పనిసరిగా పాటించాలని తిరుపతి జిల్లా విద్యుత్‌ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ కష్ణారెడ్డి తెలిపారు బుధవారం నుండి దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్‌ 14 నుండి20 వరకు జరుగుతున్నాయన్నారు. యన్‌. జి.ఓ సంస్థ ప్రతినిధి ఆర్కాట్‌ కష్ణప్రసాద్‌ సహకారంతో విద్యుత్‌ పొదుపు బ్యానర్‌, ప్లే కార్డులు, సూచిక బోర్డులతో పురవీధులలో భారీ ర్యాలీ గా తరలివెళ్లి ప్రజలకు విద్యుత్‌ పొదుపు పై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంధన పొదుపు అనేది ప్రతి ఒక్కవిద్యుత్‌ వాడకం దారులు తెలుసుకోవాలిసిన అవసరం ఉందని, భావి తరాలకు విద్యుత్‌ అవసరం ఎంతో ఉందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే విద్యుత్‌ పొదుపు అంటే డబ్బు పొదుపు అని తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యన్‌. జి. ఓ సభ్యులు రాజు రాయల్‌ , జగన్నాధం, దామోదరం, హేమంత్‌ , సాయి, పొర్లుదండాలు ఈశ్వర్‌ పాల్గొన్నారు.
తిరుపతి-కరకంబాడీ మార్గంలోని శ్రీరామ ఇంజనీరింగ్‌ కళాశాలలో జాతీయ సేవ విభాగం విద్యార్థులు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నస్వామిపల్లెలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ కళాశాలకు చెందిన డాక్టర్‌ ఎస్‌. చంద్రమోహన్‌ రెడ్డి, డాక్టర్‌ జి.మమత హాజరై ప్రజెంటేషన్‌ లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ మన్నెం రామిరెడ్డి, డైరెక్టర్స్‌ మన్నెం రామసుబ్బారెడ్డి, మన్నెం అరవిందుకుమార్‌ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.జయచంద్ర పాల్గొన్నారు.