Jun 30,2023 23:57
బ్యాంకు శాఖను ప్రారంభిస్తున్న జెసి శ్రీధర్‌

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్లలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు నూతన శాఖను బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టరు చామకూరి శ్రీధర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసి శ్రీధర్‌ మాట్లాడుతూ బాపట్లలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు శాఖ ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. శాఖ ఎటిఎంను జిట్టాస్‌ ఎంక్లేవ్‌ అధినేత, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ బాపట్ల మాజీ అధ్యక్షులు జిట్టా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆకర్షణీయమైన వడ్డీ రేటు ఇస్తున్న ఈ బ్యాంకును అందరూ ఆదరించాలన్నా రు. ఈ బ్యాంకు ఏటీఎంలో ఖాతాదారులకు ఏ నోటు కావాల్సినా అదే డినామినేషన్‌ నోట్లు రావడం ప్రత్యేకమని బ్యాంక్‌ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇండస్‌ ఇండ్‌ రీజినల్‌ హెడ్‌ కొలచిన శ్రీరామ్‌, క్లస్టర్‌ హెడ్‌ ధూళిపాళ్ల రవి కుమార్‌, బాపట్ల బ్రాంచ్‌ మేనేజర్‌ కొండలు, జీవన్‌, బయ్యా సత్యనారాయణ, కళ్ళు చెన్నయ్య, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.