హోమం చేస్తున్న దృశ్యం
హోమం చేస్తున్న దృశ్యం
ఇంద్రాక్షీ అమ్మవారి తిరునాళ్లు ప్రారంభం
ప్రజాశక్తి- మర్రిపాడు:మండలంలోని చుంచులూరు గ్రామంలో వెలసిన శ్రీ ఇంద్రాక్షి అమ్మవారి తిరునాళ్లు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.తిరునాళ్ల లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ,లక్ష్మీ గణపతి హోమం,చండీ హోమం తదితర పూజా కార్యక్రమాలను దేవస్థాన ప్రధాన అర్చకులు, సామవేద శిరోమణి మురళి కష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.గురువారం జరిగిన కార్యక్రమాలకు ఉభయు కర్తలుగా వేమన చెంచురత్నం, వారి కుమారులు వ్యవహరించారు.










