Mar 12,2023 22:55

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : స్థానిక 37వ డివిజన్‌ గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో రూ. 75 లక్షలతో అభివద్ధి పరచి, అధునాతన పరికరాలతో తీర్చిదిద్దిన షటిల్‌ కోర్టును మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం వెలంపల్లి మాట్లాడుతూ పశ్చిమ ప్రజలు క్రీడలలో రాణించాలని క్రీడా స్థలాలను అభివద్ది చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్‌ మండేపూడి చటర్జీ, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు, స్థానిక డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.