Jan 26,2023 23:00

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: రమేష్‌ హాస్పటల్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇండో బ్రిటీష్‌ హాస్పిటల్‌ను గురువారం రమేష్‌ హాస్పటల్స్‌ చైర్మన్‌ మద్దిపాటి సీతారామమోహనరావు ప్రారంభించారు. శ్రీనినవాసనగర్‌ బ్యాంక్‌ కాలనీలో అత్యాధునిక సదుపాయాలతో హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రోగులకు నాణ్యమైన సేవలను అందించనున్నట్లు తెలిపారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ పొతినేని రమేష్‌బాబు మాట్లాడుతూ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ లబ్థిదారులకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక రాయితీతో వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని క్యాథ్‌ల్యాబ్‌, ఆధునిక ఆపరేషణ్‌ థియేటర్‌, ఐసియు క్యాజువాలిటీ విభాగాలను సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ పి.వి.ఎస్‌. శ్రీనివాసప్రసాద్‌, డాక్టర్‌ భాస్కర్‌ నాయుడు, డాక్టర్‌ కృష్ణమోహన్‌, డాక్టర్‌ శివప్రసాద్‌, డాక్టర్‌ ఛాయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్‌ గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ దేవానంద్‌, ఆస్టర్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ మెట్ల శ్రీనాథ్‌, రమేష్‌ హాస్పటల్స్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాయపాటి మమత, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పావులూరి శ్రీనివాస్‌, హాస్పటల్‌ సలహాదారు డాక్టర్‌ ఎం.సి.దాస్‌ పాల్గొన్నారు.