ప్రజాశక్తి-యంత్రాంగం ఏలేశ్వరం అనేక చట్టాలు సంస్కరణలు తీసుకొచ్చి ప్రధానిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఇందిరాగాంధీ నిలిచారని కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు ఇన్చార్జ్ ఉమ్మడి వెంకట్రావు అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 126 జయంతి పరిస్కరించుకుని ప్రత్తిపాడు కళామందిర్ సెంటర్లో ఆమె విగ్రహానికి ఆదివారం పూలమాలు వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన ఉక్కు మనిషి ఇందిరా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు ధరణాలకోట శ్రీను, ఎస్‌సి సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తేజోమూర్తుల ఉషారాణి, జిల్లా అధ్యక్షుడు మొయ్యేటి సూర్య ప్రకాశరావు, కాంగ్రెస్ నాయకులు కొప్పన కోటేశ్వరరావు, పోతాబత్తుల పెద్దబాబు, కె.శామ్యూల్, పదివేల మల్లేశ్వరరావు పాల్గొన్నారు. సామర్లకోట శాఖా గ్రంథాలయంలో ఇందిరాగాంధీ చిత్ర పటానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గోకిన సునేత్ర దేవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్య్రమానికి స్థానిక గ్రంథాలయ అధికారి బందిల రత్న కుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివద్ధి చెందాలన్నారు. నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని సునేత్రా దేవి పిలుపు నిచ్చారు. సోమవారం జరిగే గ్రంథాలయ ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తారని రత్నమణి చెప్పారు. పాఠకులు, తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో తన ధైర్య సాహసాలతో చెరగని ముద్ర వేశారని డాక్టర్ సువర్ణ రాజు పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్‌లో బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రాజా, బుద్ధరాజు సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.