Nov 19,2023 21:12

ఫొటో : ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : దేశంలో పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వన్నం నాగరాజు అన్నారు. శనివారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు చెవూరు దేవకుమార్‌ రెడ్డి సూచనలతో పిసిసి ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి చేవూరు శ్రీధర్‌రెడ్డి నాయకత్వంలో వన్నం నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వన్నం నాగరాజు మాట్లాడుతూ దేశంలోని మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకై కృషిచేసిన ఉక్కు మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఆమె దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు గంగపట్ల రామ్‌కీ, ఎస్‌డి రసూల్‌, ఎ.వేణు, కె.విష్ణు, ఎల్‌.రవీంద్రనాథ్‌ రెడ్డి, కె.శ్రీనివాసులు, ఎస్‌డి అమీర్‌ భాషా, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.