ప్రజాశక్తి - ఆదోని
కుటుంబ పరిస్థితులు సరిగా లేక ఆదాయం కోసం దుబాయి వెళ్లి మోసపోయిన ఇమ్రాన్‌ను ఆదోనికి తీసుకురావాలని జర్నలిస్టులు కోరారు. గురువారం జర్నలిస్టులు శ్రీనివాసులు, బసవ, రవి, విజరు, కాసీం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇమ్రాన్ ఆర్థికంగా స్థిరపడాలని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సయ్యద్ అనే ఏజెంట్‌ను సంప్రదించి దుబారుకు మార్చి 30న వెళ్లారని తెలిపారు. వెళ్లినప్పటి నుంచి 45 రోజులు గడిచినా ఏ పని చూపించకుండా గదిలోనే ఉంచి పాస్ పోర్టును లాక్కొని అడిగితే కూడా ఇవ్వకుండా ఈ రోజు, రేపు అని వారించి కాలయాపన చేస్తున్నారని ఇమ్రాన్ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో ద్వారా షేర్ చేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దుబారులోని ఎంబసీతో సంప్రదించి భారత దేశానికి వచ్చేలా చూడాలని కోరారు.
సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న జర్నలిస్టులు










