
- సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య
- చీరాల మండలం కావూరి వారి పాలెం రైతులకు న్యాయం చేయాలి
- రైతుల భూములను పరిశీలించిన సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-చీరాల : చీరాల మండలం కావూరి వారి పాలెం పంచాయితీ రాయల్ ఆక్వా ఫ్యాక్టరీ సమీపంలోని సన్నకారు రైతుల సొసైటీ భూములలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుకుంటున్న దళారులు. సిపిఎం ఆధ్వర్యంలో అక్రమ ఇసుక త్రవ్వకాలను ఆ ప్రాంత సన్నకారు రైతులు అడ్డుకున్నారు.మంత్రి అండదండలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని తక్షణమే ఎన్ఫోర్స్మెంట్,మైనింగ్ అధికారులు రైతుల భూములను పరిశీలించి వారికి అండ ఉండి అక్రమ ఇసుక రవాణాను నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా రాయల్ ఆక్వా పరిశ్రమ నుండి వెలవడుతున్న వ్యర్ధాల వల్ల ఆ ప్రాంతంలో రైతుల భూములు అన్ని ఉప్పునీరుగా మారి పంటలు పండేందుకు వీలు లేకుండా పోయింది అన్నారు. ఇసుక దళారులు రైతుల పొలాలలో సుమారు 13 అడుగులకు పైగా త్రవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు. వారి సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతం రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే అధికారులు చర్యలు చేపట్టి ఆ ప్రాంతం రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తామని అన్నారు. వారి వెంట సిపిఎం నాయకులు ఎన్ బాబురావు, ఎం కొండయ్య, మాజీ ఎంపిటిసి శ్రీనులు ఉన్నారు.