Sep 28,2023 21:55

భూపోరాటం వద్ద నాయకులు, బాధితులు

ప్రజాశక్తి- చిలమత్తూరు : ఇళ్లపట్టాలు ఇచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని నాయకులు, బాధితులు అన్నారు. ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో గురువారం కూడా తమ ఆందోళన కొనసాగించారు, పండుగ రోజు కూడా వారు చేస్తున్న పోరాటాన్ని పలువురు అభినందించారు. ఈ పోరాట కేంద్రం హైవేకి దగ్గరగ ఉండటంతో అటుగా వెల్లే ప్రయాణికులు సైతం ప్రశంశిస్తున్నారు. ఈ సందర్బంగా భగత్‌ సింగ జయంతి వేడుకలను భూస్వాదీన పోరాట కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. భగత్‌ సింగ్‌ స్పూర్తితో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామనివ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీన్‌ కుమార్‌ అన్నారు. పోరాటంలో 50 శాతం వరుకు మైనారిటీలు ఉన్నారని పండుగను కూడా లెక్క చేయకుండా పోరాటంలో పాల్గొనడం వెనుక వారు ఇళ్లు లేక ఎన్ని కష్టాలు పడ్డారో అర్థం అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు రామచంద్ర, శివకుమార్‌, మణిస్వామి, రహంతుల్లా, హనీఫ్‌, రియాజ్‌, ఆనంద్‌, చరణ్‌, ఇర్షాద్‌, అంజి తదితరులు పాల్గొన్నారు.