Oct 25,2023 21:50

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి- చిలమత్తూరు : ఇళ్లపట్టాల కోసం పేదలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ ఆందోళన బుధవారానికి 38వ రోజుకు చేరుకుంది. గుడిసెలు వేసుకున్న సర్వేనెంబర్‌ 805 జగనన్న లేఅవుట్‌లో యధావిధిగా పేదలు ఆందోళన చేశారు. ఈ మేరకు బుధవారం సిపిఎం మండల అధ్యక్షులు లక్ష్మి నారాయణ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని నిర్వహించారు.పోరాటంలో మరో అడుగు ముందుకు వేస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్‌ కుమార్‌, కెవిపిఎస్‌ రమణ, సిఐటియు వెంకటేష్‌, చందు, రహంతుల్లా, శివ, రియాజ్‌, మణి, వేణు, సదాశివరెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.