Dec 27,2022 00:03

పట్టాలు చూపుతున్న లబ్ధిదారులు

ప్రజాశక్తి-మాకవరపాలెం: జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకుందామంటే స్థలాలు చూపించలేదని. పెట్ల దేవుడమ్మ, జోగులమ్మ, రామలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్పందనలో తహసిల్దార్‌ ప్రసాద్‌ రావుకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ, తాడపాల గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు గాను పది మంది లబ్ధిదారులను ఎంపిక చేసిందన్నారు. ప్రభుత్వం స్థలం ఇచ్చి పట్టాలు మంజూరు చేసిందన్నారు. అధికారులు చూపించిన ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణలు చేపడ దామంటే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ స్థలంలో నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటున్నాడన్నారు. ఆ వ్యక్తిపై నేటికీ చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై 20 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నామన్నారు. స్థలం అక్రమణ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని నిర్మాణాలకు అడ్డంకులు లేకుండా చూడాలని జగనన్న గృహ లబ్ధిదారులు కోరారు.