May 17,2023 23:51

 ప్రత్తిపాడు: 'మేము ఊరి లోకి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి ఇల్లు కట్టుకోమంటే.. పెద్ద వయసు వారు మాకు వెనక ముందు ఎవరూ లేరు.. అం దులోనూ పనులు లేవు ఎలా కట్టాలి అప్పుడు సి ఎం గారే ఇల్లు కట్టి ఇస్తాం అని అన్నారు కదా' అని అడుగుతున్నారని తహశీల్దార్‌ కార్యలయం సీినియర్‌ ఆసిస్టెంట్‌ మాణిక్యరావు, డిపిఒ కి తెలిపారు. జగనన్న కాలనీలో ఇళ్ల పురోగతిపై సమీక్ష సమావేశం బుధవారం మండల పరి షత్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సమా వేశం లో డిపిఒ మాట్లాడుతు 'మీరు లబ్ధిదారుల్లో పురోగతి తేకపొతే సెలవు పెట్టండి. నేను ఒక స్టెప్‌ ముందుకు వెళ్తే మీకు ఇంక్రిమెంట్‌ లు కూడా రావు' అని కోయవారి పాలెం గ్రామ అధికారులను ఉద్దే శించి అన్నారు. ప్రత్తిపాడు గ్రామ లే అవుట్‌లో ఎందుకు పురోగతి తీసుకురావడం లేదని అధికారులను ప్రశ్నించారు. నడింపాలెంలో ఉన్న లే అవుట్‌ పక్కనే ఫుడ్‌్‌ కార్పొరేషన్‌ ల్యాండ్‌ లో అక్రమంగా మట్టి తవ్వుతున్న విషయమై డిపిఒ, అధికారులను విలేకరులు ప్రశ్నిం చగా వారు సమాధానమివ్వలేదు.