తుళ్లూరు: రాజధాని ప్రాంతంలోని టిడ్కో ఇళ్ళ పట్టాలను గురువారం స్థానిక టిడ్కో గహసముదాయాల వద్ద పంపిణీ చేశారు.జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, తిడ్కో ఛైర్మెన్ జె ప్రసన్న కుమార్, డైరెక్టర్ నాగే శ్వరమ్మ తదితరులు లబ్దిదారులకు పట్టాలు అంద జేశారు.ఈ సందర్భంగా హెనీ క్రిస్టినా మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు టిడ్కో గృహాలను అరకొరగా నిర్మించి కనీస వసతులు లేకుండా ఉంచారని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గృహాలను ఆధునీకరించి, వసతులు కల్పించారని చెప్పారు. టిడ్కో ఛైర్మన్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, మండలంలో 3,200 గృహాలకు తాగునీరు,విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలు కల్పిం చడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైసిపి తాడికొండ నియో జకవర్గ సమన్వయ కర్త కత్తెర సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.










