Sep 23,2023 19:04

ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి

ప్రజాశక్తి -పొదలకూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేసే బాధ్యత తమదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. మండలంలో శనివారం ఆయన పర్యటించారు. వివిధ అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత తాటిపర్తి గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం పొదలకూరులో ముస్లింల స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన జరిపారు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఓడిపోయిన సోమిరెడ్డి నిద్రలేస్తే ఏదో విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, ఇళ్లు రాకూడదని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు నూరైనా, నూరు ఆరైనా సోమిరెడ్డి లాంటి వాళ్లు వంద మంది వచ్చినా సర్వేపల్లి నియోజకవర్గం లో అభివద్ధిని అడ్డుకోలేరని పేర్కొన్నారు. జెడ్‌పిటిసి తెనాలి నిర్మలమ్మ, పొదలకూరు సర్పంచ్‌ మల్లిక చిట్టెమ్మ, ఉప సర్పంచ్‌ వాకాటి శ్రీనివాసులు రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు చంద్రశేఖర్‌ రెడ్డి, సోమా అరుణ, మండల వైఎస్‌ఆర్సిపి నాయకులు కోనం చిన్న బ్రహ్మయ్య, మద్దిరెడ్డి రమణారెడ్డి, సోమా భాస్కర్‌, ఎం. శేఖర్‌, వేణుగోపాల్‌ రెడ్డి, ఎస్‌.కె అంజాద్‌ ఉన్నారు.