
తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు
తాడేపల్లి: ఉండవల్లిలోని గ్రామకంఠం, కొండ పోరంబోకు స్థలాలు, బాపనయ్యనగర్‌లోని ఇరిగేషన్ స్థలాల్లో నివాసం ఉంటున్న వారితో పాటు ఉండవల్లిసెంటర్ పిడబ్య్లుడి వర్కుషాపు పక్కనే ఉన్న ఇళ్లకు కూడా పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం నాయకులు తాడేపల్లి తహశీల్దార్ ఎం.నాగిరెడ్డికి సోమవారం అర్జీ అందజేశారు. గత 40 ఏళ్లుగా సుమారు రెండు వేల మంది పేదలు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారని తెలి పారు. పంచాయతీ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించారని చెప్పారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పట్టాలు వచ్చే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి, వల్లభాపురం వెంకటేశ్వరరావు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.