Nov 11,2023 21:18

తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ఇళ్ల పట్టాల పంపిణీని నిలిపివేయాలి
బేడ బుడగ జంగాల నాయకులు
ప్రజాశక్తి - పగిడ్యాల

     మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో బేడ బుడగ జంగాలకు కేటాయించిన ఇంటి స్థలాల పంపిణీని నిలిపివేయాలని బేడ బుడగ జంగాల నాయకులు తహశీల్దార్‌ను కోరారు. హైకోర్టు స్టే ఆదేశాల మేరకు వినతి పత్రంను బేడ బుడగ జంగాల నాయకులు చంద్రమోహన్‌, ఉషనాళం, జమ్మన్న, ఎల్లప్పలు తహశీల్దార్‌ భారతికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని కొందరు నాయకులు తమ స్థలాలను వారికి అనుకూలమైన వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సర్వే 416/2లో 3.55 ఎకరాలలో మొత్తం తమ కాలనీకి చెందినది అయితే ఇతరులకు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జగనన్న ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే తమ స్థలంలో కాకుండా మరో ఇతర స్థలంలో కొని ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ గతంలో వేశామన్నారు. అయితే కొందరు తమ సంతకాలను ఫోర్జరీ చేసి కేసును వాపసు తీసుకున్నట్లు అనుమతి తెచ్చుకున్నారని, దీనిపై మళ్లీ హైకోర్టులో రీ పిటిషన్‌ వేసి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చామన్నారు. అంతవరకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టొద్దని అధికారులకు చెప్పినట్లు పేర్కొన్నారు.