పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్
ప్రజాశక్తి- ములగాడ : జీవీఎంసీ 59వ వార్డు పరిధి వాయుపుత్రకాలనీ, నక్కవాని పాలెం సచివాలయం పరిధిలో అర్హులైన పేదలు 240 మందికి వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీసురేష్ ఆధ్వర్యాన ఇళ్ల పట్టాలను పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు తప్పనిసరిగా అందుతాయని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, వార్డు ఇన్‌ఛార్జి రేవాల్ల సత్యనారాయణ, నాయకులు నమ్మి శ్రీను, పిలక రామ్మోహనరావు, సచివాలయ అడ్మిన్‌లు సుధీర్, సుదీప్తి, సచివాలయ కన్వీనర్లు కుంచారావు, భూపతి, ఎదురు సత్యనారాయణ, సరోజ తదితరులు పాల్గొన్నారు.










