ప్రజాశక్తి -కంచరపాలెం : జివిఎంసి 54, 55 వార్డుల్లోని లబ్ధిదారులకు కార్పొరేటర్లు చల్లా రజినిఈశ్వరరావు, కెవిఎన్ శశికళ ఆధ్వర్యాన 54వ వార్డు పరిధి నలందనగర్‌లో ఇళ్ల పట్టాలను ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 54, 55 వార్డుల పరిధిలో 3500 మంది పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిడి పద్మావతి, కాయిత వెంకటలక్ష్మి, రత్నాకర్, దుప్పలపూడి శ్రీనివాసరావు, చిరంజీవి, ఎర్రంశెట్టి శ్రీను, బాల, షేఖ్ బాబ్జి, జుంజూరు గోవింద్, సొండి సురేష్, రమణమ్మ, సంతోష్, కరుణ, లక్ష్మి, జామి దాసు, శివప్రసాద్, ఎస్‌విఎం రెడ్డి, సారిపిల్లి జగదీశ్, దిలీప్,పాల్గొన్నారు.










