Jul 17,2023 00:07

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు జిల్లా, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు సంబంధించిన 47 వేల మందికి ఇళ్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ, కృష్ణాయపాలెంలో జగనన్న లేఅవుట్లకు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఈనెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి పాల్గొంటారని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఏర్పాట్లలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఈ మేరకు సిఎం పర్యటన ఏర్పాట్లపై రాజధాని పరిధిలోని లే అవుట్ల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో ఆదివారం సమీక్షించారు. రాజధాని పరిధిలోని 25 లే అవుట్లలోని 47 వేల మంది లబ్దిదారులకు జగనన్న ఇళ్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ, లే అవుట్లలోని ఇళ్లకు భూమి పూజ, ఇటుకల తయారీ యూనిట్‌, పైలాన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వెంకటపాలెంలో జరిగే బహిరంగ సభ కార్యక్రమంలో సిఎం పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో పాల్గొనే లబ్దిదారులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్‌, బారికేడ్ల ఏర్పాట్లు, తాగునీరు, స్నాక్స్‌, టాయిలెట్లు, పారిశుధ్య ఏర్పాట్లు, నిరంతర విద్యుత్‌ సరఫర ఉండేటట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలసిల రఘురామ్‌, లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌, గుంటూరు నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర నాయుడు, జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, ఎన్‌టిఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్‌, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ అధితి సింగ్‌, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ, విజయవాడ నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, సిఆర్‌డిఏ అడిషనల్‌ కమిషనర్‌ అలీమ్‌ భాష, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్‌ కుమార్‌, డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, ఎంటిఎంసి కమిషనర్‌ శారదాదేవి, ఆర్‌డిఓ ప్రభాకర్‌ రెడ్డి, అడిషనల్‌ ఎస్‌పి శ్రీనివాసరావు, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.