Dec 30,2022 23:02

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలి : కలెక్టర్‌

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలి : కలెక్టర్‌
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌

నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు మంజూరు చేసిన లేఔట్‌ లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యతా పథకం అనేది గుర్తుంచుకుని లే ఔట్‌ ఇన్‌ఛార్జిలు పనిచేయాల్సి వుంటుందని, అలసత్వం సహించేది లేదని కలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌ లో తిరుపతి నగరపాలక పరిధిలో మంజూరు అయిన గహాలు, ఇంటి స్థలాలు కేటాయింపు పై కలెక్టర్‌ , నగరపాలక కమిషనర్‌ అనుపమ అంజలి , తిరుపతి , శ్రీకాళహస్తి ఆర్డీఒలతో, హౌసింగ్‌ లే ఔట్‌ ఇన్‌ఛార్జిలతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ సూచిస్తూ లే ఔట్‌ ఇంచార్జులు మరోమారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కేటాయించిన గహాల వద్ద నిర్మాణాలకు అనువుగా వుందా , ఎత్తుపల్లాలు, కాలవలు వంటివి ఉంటే వాటిని సరిచేయడం చూడాలని అన్నారు. ఇప్పటికే కేటాయించిన 5 లే ఔట్‌ లలో 19,522 గహాలలో ప్రారంభంకానివి 4 వేల వరకు ఉన్నాయని, రానున్న జనవరి 15 నాటికి జియో ట్యాగింగ్‌ చేపట్టి అన్ని గహ నిర్మాణాలు ప్రారంభించాలని , నిర్మాణాల్లో వున్న వాటి స్టేజ్‌ కన్వర్షన్‌ వేగవంతంగా జరగాలని అన్నారు. అర్హతగల లబ్దిదారులకు 90 రోజుల ఇళ్ల స్థలాల మంజూరు కూడా అందుబాటులో వున్న చోట కేటాయింపుకు సిద్దంగా వుండాలని సూచించారు. లే ఔట్‌ లలో వసతులకోసం నిర్దేశించిన రహదారులు, కమ్యునిటీ హాల్స్‌ , ఇతర సౌకర్యాల కోసం కేటాయించిన 40 శాతం స్థలం అనువుగా వున్నది లేనిది చూడాలని తెలిపారు. ఎం.కొత్తపల్లి లే ఔట్‌ లో కొంత మేర లెవలింగ్‌ పెండింగ్‌ వుందని త్వరగా పూర్తిచేసి లబ్దిదారులకు అందించాలని ఆదేశించారు. బాధ్యతతో పనిచేయాలని, ఇప్పటికే 9 నెలలు గడిచిందని, వాస్తవ పరిస్థితులు గమనించి అవగాహనతో త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమీక్షలో ఆర్డీవోలు కనక నరసారెడ్డి , రామారావు, హౌసింగ్‌, నరేగా పిడి శ్రీనివాస ప్రసాద్‌ , ఈఈ చంద్ర శేఖర్‌ బాబు , తహసిల్దార్లు వెంకటరమణ, శివప్రసాద్‌, ఉదరు సంతోష్‌ ,నగరపాలక డిప్యూటి కమిషనర్‌ చంద్రమౌళీశ్వర రెడ్డి పాల్గొన్నారు