Aug 03,2023 21:55

ఇళ్ల పనులను పరిశీలిస్తున్న హౌసింగ్‌ అధికారి దివాస్‌

సాలూరు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న లేఅవుట్‌ లలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్‌ రాష్ట్ర అధికారి ఎం.కె.దివాన్‌ ఆదేశించారు. గురువారం ఆయన పట్టణంలోని నెలిపర్తి లేఅవుట్‌ -2, గుమడాం లేఅవుట్‌ -5లను పరిశీలించారు. నెలిపర్తి లేఅవుట్‌ను పరిశీలించిన సమయంలో లబ్దిదారులు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన రహదారిని కలుపుతూ కాలనీ రహదారి ని నిర్మించాలని కోరారు. గుమడాం లేఅవుట్‌ లో చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టరు నెలిపర్తి లేఅవుట్‌ పనులు ప్రారంభించలేదని చెప్పారు. అనంతరం గుమడాం లేఅవుట్‌ ని పరిశీలించి ఇళ్ళ నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్‌ పిడి ఈ.శ్రీనివాసరావు , అర్బన్‌ ఎఇ టి.శ్రీనివాసరావు ఉన్నారు.